మోహన్ బాబు అంటే కోపం అందుకే!

తెలుగు సినీ పరిశ్రమలో మోహన్‌బాబుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎన్టీఆర్‌, దాసరి నారాయణరావుల తర్వాత అంతటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా అందరు చెప్పుకుంటారు. అయితే ఎక్కువ మంది మోహన్‌బాబు ఎదుటి వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తారని అంటారు. దీని గురించి మోహన్‌బాబు స్పందిస్తూ, నేను అంకిత భావంతో నటిస్తాను. ఇతరులు కూడా అలాగే ఉండాలని భావిస్తాను. సినిమా సెట్‌లోకి వెళ్లితే తీయబోయే సన్నివేశం గురించే అందరు ఆలోచించాలనేది నా మనస్తత్వం. అంతేగానీ సెల్‌ఫోన్స్‌, పేకాట వంటివి ఆడితే మాత్రం ఒప్పుకోను. ఒకసారి కొంత మంది నా షూటింగ్‌ సమయంలో పేకాట ఆడుతుంటే కోపం వచ్చి కాలితో టేబుల్‌ని తన్నాను. ఇటీవల కూడా అలాంటి ఘటన జరిగింది. అక్కడ అలా జరుగుతోందంటే ఆ దర్శకునిదే తప్పు. అప్పటి నుంచి ఎవ్వరూ నా సినిమా షూటింగ్‌ సమయంలో పేకాట ఆడే సాహసం చేయరు. ఇలాంటి పద్దతుల వల్లనే మోహన్‌బాబు అంటే కోపం ప్రదర్శిస్తారు. అయిష్టత వ్యక్తం చేస్తారు... అని చెప్పుకొచ్చాడు. 

ఇక మోహన్‌బాబు ద్విపాత్రాభినయం పోషించగా తాజాగా విడుదలైన 'గాయత్రి' చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. గాయత్రి పాత్రకు మంచి మార్కులే పడుతుండగా శివాజీ క్యారెక్టర్‌ మాత్రం ఆకట్టుకోవడం లేదు. దీంతో పనిలో పనిగా మోహన్‌బాబు కూడా రివ్యూరైటర్లపై ఇంతెత్తున లేచాడు. ఒకడు రాసిన రివ్యూని బట్టి ఒక సినిమా చూడాలో లేదో నిర్ణయించుకోవడం తప్పు. ఆ వ్యక్తికి వేరే హీరో అంటే అభిమానమే.. మరొకరి చేతిలో కీలు బొమ్మే అయిఉండవచ్చు. ఒకరొకరుగా రివ్యూలు రాయడం మానేయండి.. ఓ 25 మంది గ్రూప్‌గా సినిమాలు చూసి అందరి అభిప్రాయలు తీసుకుని రివ్యూ ఇవ్వండి అంటూ అంతెత్తున లేచాడు. 

ఆయన కోపానికి కారణం 'గాయత్రి' చిత్రానికి పూర్తిగా బాగుందనే రివ్యూలు రాకపోవడమే కారణమని అర్ధమవుతోంది. అయితే ఆయన ఇష్టం వచ్చినట్లు, ఆయన మనసుకు నచ్చినట్లు ఎలా ప్రవర్తిస్తారో.. రివ్యూ రైటర్లు కూడా ప్రేక్షకుల స్పందనను చూసి తమకు నచ్చినట్లుగా రివ్యూలు ఇస్తారు. ఆయా రివ్య్యూ రైటర్ల మీద నెటిజన్లకు ఉండే నమ్మకం బట్టి వారు ఆ చిత్రాన్ని చూడాలో లేదో నిర్ణయించుకుంటారు. మరి ఇంత చిన్న లాజిక్‌ని మోహన్‌బాబు మిస్‌ కావడం బాధాకరం. 

Mohan babu about.. why people angry on him

Mohan babu angry comments on angry
mohan babu
angry
people
angry
Advertisement
Advertisement