చరణ్ న్యూలుక్ లోకి వచ్చేస్తున్నాడు !

రామ్ చరణ్ సుకుమార్ రంగస్థలం కోసం దాదాపుగా ఏడాది నుండి గుబురు గెడ్డంతోనే కనిపిస్తున్నాడు. రంగస్థలంలో చిట్టిబాబుగా, సౌండ్ ఇంజినీర్ గా రామ్ చరణ్ ఇలా గెడ్డం పెంచి మాస్ లుక్ లో దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం 'రంగస్థలం' సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కూడా కొట్టేశారు. ఏదో పాటల ప్యాచ్ వర్క్ తప్ప మిగతా సినిమా పూర్తి కావడంతో త్వరలోనే రంగస్థలం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయనుంది. అయితే రంగస్థలం షూటింగ్ కంప్లీట్ కావడంతో రామ్ చరణ్ చిట్టిబాబు లుక్ నుండి రిలీఫ్ అవుతున్నాడట. 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమా కోసం చరణ్ న్యూ లుక్ లోకి మారిపోతున్నాడు. ఇప్పటికే చరణ్ తన హెయిర్ స్టయిల్ ని మార్చే పనిలో బిజీగా వున్నాడట. దానికోసం ముంబై నుంచి ప్ర‌త్యేకంగా ఓ హెయిర్ స్టైలిస్ట్ ను ర‌ప్పించాడు. అత‌ను చెర్రీకి వివిధ ర‌కాల హెయిర్ స్టైలింగ్ చేసి చూపించ‌బోతున్నాడు. అందులో ఏదో ఒక‌టి బోయ‌పాటి శ్రీను సినిమాకు సెట్ అవుతుందని అంటున్నారు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం కోసం పెంచిన గుబురు గెడ్డాన్నికూడా తీసేస్తాడని అంటున్నారు.

ఏడాది నుండి గెడ్డంతోనే తిరుగుతున్న రామ్ చరణ్ తన భార్యతో బయటికి వెళ్ళిన చరణ్ అదే గెడ్డంతో వెళుతున్నాడు. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి రామ్ చరణ్ గెడ్డంతో ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు. సినిమాలో కూడా చిట్టిబాబు క్యారెక్టర్ లో చరణ్ గెడ్డం లుక్ సూపర్. మరి ఇప్పుడు బోయపాటి సినిమా కోసం చరణ్ హెయిర్ స్టయిల్ తో పాటు... గెడ్డం కూడా గీకేసి క్లీన్ షేవ్ లోకి మారిపోతున్నాడట. ఇకపోతే బోయపాటి - చరణ్ సినిమా ప్రస్తుతం చరణ్ లేకుండానే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని... చరణ్ తో కలిసి సెకండ్ షెడ్యూల్ కోసం సమాయత్తమవుతోంది.

Ram Charan Changed Rangasthalam Look

Ram Charan Ready to Boyapati Film
ram charan
rangasthalam
changed
new look
boyapati movie
Advertisement
Advertisement