Advertisement

అంబేడ్కర్‌ వాదులు తెలుసుకోవాల్సిన నిజాలివి!

Tue 21st Mar 2017 11:10 AM
baba saheb ambedkar,india,br ambedkar,constitution of india  అంబేడ్కర్‌ వాదులు తెలుసుకోవాల్సిన నిజాలివి!
అంబేడ్కర్‌ వాదులు తెలుసుకోవాల్సిన నిజాలివి!
Advertisement

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌.. ఈయన ప్రపంచం గర్వించదగ్గ మేథావి, ఆయన మేథావి అని చెప్పడానికి కూడా మనకు అర్హత లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పేరును ఉచ్చరించడానికి కూడా నేటితరంలో ఎవ్వరికీ అర్హత లేదనిది వాస్తవం. మన భవిష్యత్తు తరాల స్థితిగతులను... దాదాపు వంద నుంచి రెండోదరేళ్లను ఆయన తన దార్శనికతతో ముందుగానే ఊహించారు. వారికి తగినట్లుగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. కానీ కొందరు మాత్రం అంబేడ్కర్‌ కొత్తగా మన రాజ్యాంగంలో రాసిన అంశాలేవీ లేవని, ప్రపంచంలోని పలు దేశాల రాజ్యాంగాలను కాపీ కొట్టి మన దేశ రాజ్యాంగాన్ని రచించారని విమర్శలు చేస్తూంటారు. కానీ పలు దేశాల రాజ్యాంగాలలోని మంచిని తీసుకుని, దానికి మన దేశ పరిస్థితులను ఆకళింపు చేసుకుని, దానికీ తగ్గట్లుగా మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారనేది వాస్తవం. 

ఆయన మేధావితనాన్ని మనం కీర్తించే స్థితి, పరిస్థితి మనకులేదు. వర్ణవివక్ష, కుల వివక్ష అధికంగా ఉన్న ఆ రోజుల్లోనే ఆయన న్యాయవాదకోవిదునిగా పేరుపొంది, మనదేశానికి దిశానిర్దేశం చేశారు. ఇక ఆయన పేరును కేవలం ఇప్పుడు కొందరు దళిత, బహుజన పార్టీల నాయకులు హైజాక్‌ చేశారు. ఆయన్ను కొన్నికులాల పక్షపాతిగా మార్చివేశారు. అగ్రవర్ణాలలో ఆయనంటే చులకన భావన తేవడంలో ఈ సోకాల్డ్‌ దళిత నాయకులు, మేథావులు సఫలమై, ఆయన్ను కొందిరివాడిగా మార్చివేశారు. తమకు అన్యాయం చేసింది అంబేడ్కరే అనే విధంగా మంచి ప్రజ్ఞాపాటవాలున్న అగ్రవర్ణ పేదల మనసుల్లో నాటుతున్నారు. ఆయన రాసిన రాజ్యాంగానికి, ఆయన చేసిన ప్రసంగాలకు నేటి నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని విభజన వాదాన్ని తెరపైకి తెచ్చారు. మత స్వేఛ్చని ఆయన మనకు ఇచ్చినా కూడా ఆయన బలవంతపు మతమార్పిడులను ఆనాడే ఖండించారు. హిందు మతంలోని వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆయన మతం మార్చుకున్నారు. ఈసమయంలో పలువురు ఆయన్ను క్రైస్తవ మతం పుచ్చుకునేలా బలవంతం చేసినప్పటికీ ఆయన మనదేశంలోనే పుట్టిన బౌధ్దమతాన్ని మాత్రమే స్వీకరించారు. 

అదే సమయంలో రిజర్వేషన్లకు కూడా కాలపరిమితి పెట్టారు. దీనిని ఉపయోగించుకుని కుల వాదాన్ని తెరపైకి భవిష్యత్తులో మన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయలను చేస్తారని ముందే ఊహించిన దానికి కాలపరిమితి పెట్టారు. కానీ మన నాయకులు మాత్రం ఆయన ఊహించిన విధంగానే కుల ఓట్లను రిజర్వేషన్లకు వాడుకున్నారు. ఆయన మతాల ప్రాతిపదికగా ఎప్పుడు రిజర్వేషన్లుపెట్టాలని, లౌకిక వాదం పేరుతో మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమని గానీ, లేదా కులం పేరు వాడినా కూడా అట్రాసిటీ కేసులు పెట్టాలని ఆయన చెప్పలేదు. ప్రతి కులం, మతం వారికి వారి వారి కులాలపై, మతాలపై అభిమానం ఉంటుందని, కాబట్టి ఏ కులాన్ని, ఏ వర్గాన్ని కించపరచకూడదని సూత్రీకరించారు. 

కానీ నేడు అగ్రవర్ణాలను చెడుగా తిట్టినా లేని కేసులు కేవలం దళితులను 'హరి' జనులుగా, 'గిరి' జనులుగా నామకరణం చేసిన వాటిని కూడా నేడు అలా పిలవడం తప్పంటున్నారు. ఏ వివాదం చెలరేగినా, ఏ తప్పు చేసినా కూడా దళితకార్డులను చూపించి హైజాక్‌ చేస్తున్నారు. బంగారు లక్ష్మణ్‌ లంచం తీసుకుంటూ తెహల్కా స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికి పోయినా కూడా, తాజాగా ఓ పశ్చిమ బెంగాల్‌లోని జడ్జిని సుప్రీంకోర్టు తమ ముందు హాజరుకావాలని స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్ధానం తీర్పునిచ్చినా కూడా ఆయన కులం కార్డును బయటకు తీసి, తాను దళితుడిని కాబట్టే సుప్రీంకోర్టుకు తాను చులకన అయ్యానని వ్యాఖ్యానించాడు. ఇక నేటి దళితుల్లో ఎక్కువమంది అంబేడ్కర్‌ భావాలకు వ్యతిరేకంగా క్రైస్తవ మతం పుచ్చుకుని మతం మార్చుకున్న తర్వాత కూడా దళిత క్రిస్టియన్లు అనే పేరుతో రిజర్వేషన్లు పొందుతున్నారు. 

వైఎస్‌రాజశేఖర్‌రెడ్ది, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వంటి అనేకులు క్రిస్టియన్‌ మతం పుచ్చుకుని, అనేక రాయితీలు, మైనార్టీ కళాశాలలు, ఇతర ప్రయోజనాలు పొందుతూనే రెడ్డి అనే తోకను మాత్రం వదలడం లేదు. ఇక కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వామపక్షాలలోనే కాదు.. నక్సలైట్లు, విప్లవకారుల్లో, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా భూములు, ఆస్తులు కోల్పోయిన కిందటి తరం నేతల్లో అధికులు రెడ్డి, కమ్మ, బ్రాహ్మణులు వంటి అగ్రవర్ణాల వారే ఎక్కువ. కుల వివక్షతకు వ్యతిరేకంగా తమ పేర్ల చివరన ఉండే రెడ్డి, నాయుడు, శాస్త్రి, శర్మ వంటి తోకలను వదులుకొని, సహపంక్తి భోజనాలను ప్రోత్సహించిన వారే ఎక్కువనేది నగ్న సత్యం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement