Advertisementt

పవన్ విశ్వరూపం ఆ సినిమాలో చూశాం: చిరు

Mon 21st Mar 2016 12:52 PM
pawan kalyan,chiranjeevi,sardaar gabbar singh audio launch  పవన్ విశ్వరూపం ఆ సినిమాలో చూశాం: చిరు
పవన్ విశ్వరూపం ఆ సినిమాలో చూశాం: చిరు
Advertisement
Ads by CJ

'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత తమ్ముడు కళ్యాణ్ బాబు సినిమా ఫంక్షన్ లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో రిపీటెడ్ గా చూసిన సినిమా ఏదైనా ఉంటే అది 'గబ్బర్ సింగ్' సినిమా. సినిమాలో సాంగ్స్ గానీ, సీన్స్ గానీ టీవీలో వస్తుంటే చాలా ఇంటరెస్టింగ్ గా చూస్తూ.. ఉండిపోయేవాడ్ని. కళ్యాణ్ బాబు నటించిన అన్ని సినిమాల్లో గబ్బర్ సింగ్ ను మాత్రం చాలా ఆసక్తిగా చూసేవాడిని. పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఆ సినిమాలో చూశాం. ఈ రకంగా పవన్ తన అభిమానులను   అలరించాలని కోరుకునేవాడ్ని. 'దబాంగ్' సినిమాకు గబ్బర్ సింగ్ కు అసలు సంబంధం ఉండదు. ఒరిజినల్ ను తీసుకొని పవన్ స్టైల్ లో మార్చి తీశాడు. ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు. గబ్బర్ సింగ్ తో ఆ విషయం ప్రూవ్ అయింది. అత్తారింటికి దారేది సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించి సెపరేట్ ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నాడు..అని అన్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ