'సర్దార్ గబ్బర్ సింగ్' మరో 'షోలే'!

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక పై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..  'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా పవన్ మనసు పెట్టి చేసిన సినిమా. పవన్ అందించిన కథ, కథనాన్ని బాబీ చక్కగా తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబినేషన్ అత్యద్బుతం. బాబీ డైరెక్ట్ చేసిన 'పవర్' సినిమా చూశాను. టాలెంట్ ఉన్న డైరెక్టర్. అలాంటి టాలెంట్ ను గుర్తించి పవన్ తనకు అవకాశం ఇచ్చాడు. రామ్ పూర్ అనే సెట్ వేసి 'షోలే' సినిమా చేశారు. ఈ సినిమా కోసం రతన్ పూర్ అనే సెట్ వేశారు. నేను సెట్స్ కి వెళ్లి చూసినప్పుడు షోలే సినిమా ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా కూడా మరో 'షోలే' అవుతుందనడంలో సందేహం లేదు. పవన్ లో హ్యూమనిజం, హ్యూమర్ యాంగల్ ఉంది. హీరోయిజానికి హ్యూమర్, మాస్ తోడయ్యి.. ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే ఆ సినిమా ఎలాంటి హైట్స్ కు రీచ్ అవుతుందో ఊహించలేం. ఎంటర్టైన్మెంట్, డ్రామా, హ్యూమర్ టచ్ తో ఈ సినిమా ఉంది. అందరిలానే నేను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ ఈ సినిమాలో ఉందని తెలిసి సినిమా చూడాలనే ఆసక్తి మరింతగా పెరిగింది...అని అన్నారు.

sardaar gabbar singh
sholey
mega star chiranjeevi
pawan kalyan