పవన్..జోడు గుర్రాల స్వారీ చెయ్!

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ...పవన్ సినిమాల్లోకి రాక ముందు తను భవిష్యత్తులో ఏం చేయాలో తెలియక డైరెక్షన్ ఇవ్వమని నన్ను, తన వదినను కలిసి మాట్లాడాడు. నువ్వు హీరో అవ్వాలన్నది మా కోరిక అని చెప్పాం. దానికి తగినట్లుగా తను ప్రిపేర్ అయ్యాడు. ఈరోజు పవన్ ఈ స్థాయిలో ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంది. తన ఎదుగుదలను చూసి మొదట సంతోషించేది నేను, మా తల్లితండ్రులు. అలాంటిది పవన్ రెండు మూడు సినిమాల తరువాత ఏం చేస్తానో చెప్పలేకపోతున్నానని చెప్పాడు. తను ఏ రంగంలో ఉన్నా.. రాణించగలడు. అంత మాత్రం చేత ఈ రంగాన్ని దూరంగా పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పాను. జోడు గుర్రాల స్వారీ చేయగలిగే కెపాసిటీ పవన్ లో ఉంది. నా మాట కాదనడనే అనుకుంటున్నాను(నవ్వుతు..). ఈ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఇండస్ట్రీలో ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నాను. రికార్డ్స్ అనేవి అందరి సొంతం కావాలి. ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ చేస్తోందని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. బాలీవుడ్ లో ఏకంగా 800 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  ఈ సినిమా 100 రోజులు ఫంక్షన్ జరుపుకోవాలి... అని అన్నారు. 

pawan kalyan
chiranjeevi
chiranjeevi about pawan kalyan movies
sardaar gabbar singh audio