ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'సర్దార్' మరో 'జానీ' కాదు!: పవన్

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక లో పవన్ మాట్లాడుతూ..మా తల్లిదండ్రుల తరువాత అంతటి వారు నాకు అన్నా వదినలే. నేను చేసిన 'జానీ' సినిమా ఫ్లాప్ అయింది. క్రియేటివ్ ప్రాసెస్ లో ఫెయిల్యూర్ సహజం. దానికి భయపడి పారిపోకూడదు. అవివేకంతో ఆ సినిమా చేయలేదు. నాకున్న పరిధిలో చేశాను. కాని ఈ సినిమా జానీ లాగా డిసప్పాయింట్ చేయదనే నమ్మకం నాకుంది. ఇండియన్ వెస్ట్రన్ సినిమా చేయాలనేది నా కోరిక. ఈ సినిమా స్క్రిప్ట్ రెండున్నర సంవత్సరాలు రాసుకున్నాను. ఈ ప్రాసెస్ లో నన్ను భరించి నా స్నేహితుడు శరత్ మరార్ నాతోనే ఉన్నాడు. అనుకున్న సమయంలో సినిమాను రిలీజ్ చేయాలని అందరిని హింసించాను. నిజానికి ఈ సినిమా చివరి సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ కావాల్సింది. నేను లేట్ చేస్తూ వచ్చాను. అయినా మాకు సహకరించిన ఈరోస్ సంస్థకు నా అభినందనలు.. అని చెప్పారు.
sardaar gabbar singh
johnny
pawan kalyan
pawan about sardaar gabbar singh






































