సర్దార్ గురించి నాకేం తెలియదు: త్రివిక్రమ్

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు వారి సినిమా బలమెంతో ప్రపంచానికి చాటిచెప్పిన చిరంజీవి గారి కుటుంబం నుండి మరింత సంతోషాన్ని అందించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ వచ్చారు. నిజంగా చెప్పాలంటే నాకు ఈ సినిమా గురించి ఏమి తెలియదు. నేను కూడా సగటు ప్రేక్షకుడిలా సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆవేశం, ఆదర్శం కాళ్లై నడిచే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన గురించి నాకు అదే మాట గుర్తొస్తుంది. అంతా కలిపి నేను పిడికెడు మట్టి కావొచ్చు.. ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండాకు ఉన్న పొగరుంది. అలాంటి పొగరును మనస్పూర్తిగా ఇష్టపడుతూ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆయనకు, అందరికి ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. వచ్చే ప్రతి సినిమా మన పరిధిని పెంచుతూ.. ముందుకు వెళ్లాలని.. భారతీయ పరిశ్రమ ఒక్కటి కావాలని.. అది ఈ సినిమాతో జరగాలని ఆశిస్తున్నాను..అని అన్నారు. 

sardaar gabbar singh
trivikram srinivas
pawan kalyan
chiranjeevi