పవన్‌కు నాగబాబు రికమండేషన్‌...!

నాగబాబు ఆధ్వర్యంలో చాలాకాలం నుంచి వస్తున్న రియాల్టి షో 'జబర్దస్త్‌'. అందులో నటించే కామెడీ ట్రూప్‌లు బయట కూడా ఫేమస్‌ అయ్యాయి. సినిమాల్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. వాళ్లకు పూర్తి స్థాయి బ్రేక్‌ ఇవ్వాలని నాగబాబు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది అందులో భాగంగానే తన సోదరుడు పవన్‌కళ్యాణ్‌కు నాగబాబు రికమండేషన్‌ చేసి ఈ టీమ్‌లోని వారికి 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'లో వేషాలు ఇప్పించాడని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం 'జబర్దస్త్‌' టీమ్‌ అంతా 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'లో కానిస్టేబుల్స్‌గా కనిపించనున్నారు. దానికి తోడు 'జబర్దస్త్‌' బ్యాచ్‌ మొత్తం పవన్‌కు అభిమానులు కావడం కూడా ప్లస్‌ అయింది అని అంటున్నారు. ముఖ్యంగా షకలక శంకర్‌ అయితే గతంలోనే పవన్‌కు గుడి, ఊళ్లో పవన్‌ పేరుతో బడి కూడా కట్టిస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 

nagababu
pawan kalyan
sardhar gabbar singh
jabardasth team