పవన్‌ తదుపరి చిత్రంపై క్లారిటీలేదు..!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. మార్చి నెలాఖరులోపు ఫస్ట్‌కాపీని తీసుకొచ్చి ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్లాన్‌ చేస్తోంది. అయితే 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' తర్వాత పవన్‌ నటించే చిత్రం ఏమిటి? అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. త్రివిక్రమ్‌తో 'కోబలి', దాసరి నిర్మాణంలో మరో చిత్రం ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన తమిళ దర్శకుడైన ఎస్‌.జె.సూర్య, కొరియోగ్రాఫర్స్‌ జానీ మాస్టర్‌, రాజుసుందరంల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే పవన్‌ మైత్రి మూవీస్‌ బేనర్‌లోనే తన తదుపరి చిత్రం చేయనున్నాడని సమాచారం. కాగా తమిళంలో సూపర్‌హిట్‌ అయిన అజిత్‌ 'వీరం' చిత్రాన్ని ఆయన తెలుగులో రీమేక్‌లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మెగాఫ్యామిలీకి చెందిన చిరంజీవి, రామ్‌చరణ్‌లు తమిళ రీమేక్కుల్లోనే నటిస్తున్నారు. అదే బాటలో పవన్‌ కూడా పయనించనున్నాడని ఆయన సన్నిహితుల సమాచారం. 

pawan kalyan
sardhar gabbar singh
mythri movie makers
veeram movie remake