ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Poonam Pandey Fires Back at Swara Bhasker

స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై పూనమ్ పాండే ఫైర్

Poonam Pandey Fires Back at Swara BhaskerPoonam Pandey Fires Back at Swara Bhasker



సంజాయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ `పద్మావత్` లో  చూపించిన జౌహర్ (ఆత్మార్పణ) ఘట్టంపై గతంలో నటి స్వరా భాస్కర్ చేసిన విమర్శలను మోడల్, నటి పూనమ్ పాండే  తప్పుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. `పద్మావత్` చిత్రం చూసిన తర్వాత స్వర రాసిన బహిరంగ లేఖలో జౌహర్ సన్నివేశాన్ని నిరసిస్తూ చేసిన వ్యాఖ్యలను పూనమ్ పాండే చాలా తెలివితక్కువ మాటగా అభివర్ణించారు. సంజాయ్ లీలా భన్సాలీ చారిత్రక కథ ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించారని, చరిత్రలో జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో ఎలాంటి తప్పు లేదని ఖండించారు.

సినిమా -చరిత్రకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ పూనమ్ పాండే మాట్లాడారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలను చూసేటప్పుడు వాటిని ఆనాటి కాలమాన పరిస్థితులు, సంస్కృతి, చరిత్ర ఆధారంగా అర్థం చేసుకోవాలే తప్ప, నేటి ఆధునిక కోణంలో విమర్శించడం సరికాదన్నారు. రాజపుత్ర రాణులు  ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని తెరపై ఆవిష్కరించడం చారిత్రక చిత్రాల బాధ్యత అని, దానిని సమాజంలో ఏదో ఒక భావజాలాన్ని ప్రోత్సహించడంగా చూడకూడదని పూనమ్ అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి పద్మావత్ చిత్రం చుట్టూ జరిగిన పాత వివాదాన్ని, భావప్రకటన స్వేచ్ఛ , చారిత్రక సినిమాల చిత్రీకరణపై ఉన్న భిన్నాభిప్రాయాలను తెరపైకి తీసుకొచ్చాయి. చారిత్రక అంశాలను సినిమాగా తీసేటప్పుడు దానికి జోడించే ఎమోషన్స్, మేకర్స్ విజన్‌ను గౌరవించాలని పూనమ్ పేర్కొనడం సోషల్ మీడియాలో.. బాలీవుడ్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Poonam Pandey Reacts to Swara Bhasker’s Padmaavat Criticism