ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10 opening episod highlights

బిగ్ బాస్ 10: మరీ చప్పగా..

Bigg Boss 10 opening episod highlightsBigg Boss 10 opening episod highlights


బిగ్ బాస్ సీజన్ 10 ని స్టార్ మా మొదలు పెట్టింది. గత రాత్రి ఆదివారం సీజన్ 10 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు నాగార్జున హోస్ట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు. కామనర్స్ vs సెలబ్రిటీస్ అంటూ ఓ పదహారు మంది హౌస్ లోకి వెళ్లారు. అగ్నిపరీక్ష 2 నుంచే విమర్శలు మూటగట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా అంతే చప్పగా సాగింది.

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి స్టార్ మా కన్నా ముందే బిగ్ బాస్ సీజన్ 10 లీకులు స్టార్ట్ చేస్తే ఆడియన్స్ లో ఎందుకు ఉంటుంది ఆసక్తి.

నాగార్జున ఎంతగా కొత్తగా ట్రై చేసినా ఈ సీజన్ పై ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ ముందు నుంచి కనిపించలేదు. అందుకు తగ్గట్టే ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా మరీ రొటీన్ గా సాగింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుల్లితెర ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేలా స్టార్ మా ప్లాన్ చేస్తే బావుండేది అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

ఇక ఈ సీజన్ 10 హౌస్ లోకి వెళ్లిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లె.

ఎన్నెన్నో జన్మల బంధంతో బుల్లితెరకు పరిచయమైన దేబ్జానీ మోదక్, నటుడు త్రిగుణ్, అగ్నిపరీక్షలా గోల్డెన్ టికెట్ సాధించి డైరెక్ట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సింగర్ ఝాన్సీ, యాంకర్ సుధీర్, అగ్నిపరీక్షలా నెగ్గి ఆడియన్స్ మనసు గెలిచినా అమన్, సీరియల్ నటి చైత్ర రాయ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్,

అగ్నిపరీక్ష షాలిని, నటుడు టెంపర్ వంశీ, అగ్నిపరీక్ష  సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, RJ చరణ్, నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, అగ్నిపరీక్ష రోహిత్, సీరియల్ నటుడు ముఖేశ్ గౌడ లు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టారు.

Bigg Boss 10