విశ్వనాథ్ అండ్ సన్స్-రికార్డ్ ఓటీటీ డీల్

Viswanath and Sons OTT Deal Closed


ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా ఓటీటీ డీల్స్ పూర్తి కాక చివరికి సినిమాల థియేట్రికల్ రిలీజ్ లనే ఆపేసుకునే పరిస్థితి నడుస్తుంది. చాలా సినిమాలు ఓటీటీ డీల్స్ పూర్తి కాలేదు. అందుకే విడుదల చేసుకోలేక, అలా అని ఉంచుకోలేక నిర్మాతలు సఫర్ అవుతున్నారు.

ఇలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ విశ్వనాథ్ అండ్ సన్స్  డిజిటల్ హక్కుల కోసం భారీ ధర వెచ్చించినట్లుగా తెలుస్తుంది.

దాదాపుగా రూ.81 కోట్లకు అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ విశ్వనాథ్ అండ్ సన్స్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. లక్కీ భాస్కర్ సక్సెస్ తో వెంకీ అట్లూరి, వీరభద్రుడు సక్సెస్ తో సూర్య క్రేజీ గా మారడంతోనే ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ రైట్స్ కి అంత డిమాండ్ పలికినట్లుగా తెలుస్తుంది. 

Netflix Grabbed Viswanath and Sons OTT Rights