అనుపమ పోస్ట్ వెనుక రెండేళ్ల కన్నీరు, శారీరక, మానసిక క్షోభ!
Anupama Parameswaran On Her EX
మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి సంచలన విషయాలను వెల్లడించారు. గత రెండేళ్లుగా ఒక రిలేషన్‌షిప్‌లో తీవ్రమైన భావోద్వేగ, మానసిక క్షోభను అనుభవించినట్లు తెలిపారు. ఎలాంటి భయాలు లేకుండా స్వరాన్ని తిరిగి పొందుతూ తాను కోలుకున్న తర్వాతే ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టినట్లు పేర్కొన్నారు. రెండేళ్లపాటు నార్సిసిస్టిక్ అబ్యూస్ బారిన పడినట్లు తెలిపారు. ఈ పదం గురించి నటి మడోన్నా సెబాస్టియన్ మాట్లాడిన ఓఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చూసినప్పుడు తాను ఒక్కసారిగా వణికిపోయానని అనుపమ గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలోనే తాను కూడా అలాంటి టాక్సిక్ సంబంధంలోనే ఉన్నానని గుర్తించినట్లు తెలిపారు. ఈ సంబంధం తన వ్యక్తిత్వాన్ని ఎంతగానో కుంగదీసిందని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన బంధాలు వ్యక్తిని ఎదుగుదల వైపు నడిపిస్తాయని.. కానీ ఈ బంధంలో మాత్రం తాను మానసికంగా, శారీరకంగా కృశించిపోయానన్నారు. `ఆ బంధం కారణంగా నేను మరింత కుంచించుకుపోయాను. అప్పుడు చాలా బరువు తగ్గానన్నారు.
గత నెలలో అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ పోస్ట్ పెద్దఎత్తున వైరల్ అయింది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని ముగింపులు అవసరమని.. ఇకపై తాను ఏ అనుమతులు కోరకుండా? భయపడకుండా జీవితాన్ని సొంతంగా జీవిస్తానని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆ పోస్ట్ వెనుక రెండేళ్ల కన్నీరు, శారీరక , మానసిక క్షోభ ఉన్నాయని పూర్తిగా కోలుకున్నాకే దానిని షేర్ చేశానని స్పష్టం చేశారు.
అనుపమవ ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అనుపమ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా అనుపమ వ్యక్తిగత జీవితంపై వస్తున్న రకరకాల ఊహాగానాల మధ్య ఆమె స్వయంగా విషయాన్ని బయటపెట్టడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.







































