విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ రివ్యూ
Vishwanath and Sons Pre Review
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంపై ట్రేడ్ లోనే కాదు ఆడియన్స్ లోను పాజిటివ్ బజ్ ఉంది. విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషనల్ ఈవెంట్స్, ట్రైలర్ అన్ని సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఇక సినిమా ప్రీ రివ్యూ లోకి వెళితే..
అప్పట్లో సంజయ్ రామస్వామి గా సూర్య గజినీ సినిమాలో అద్దరగొట్టేసినట్టుగా ఇప్పుడు వివనాథ్ అండ్ సన్స్ లో సంజయ్ విశ్వనాథ్‌గా అంత అద్భుతంగా నటించారు అని, ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ నడిస్తే.. సెకండ్ హాఫ్ లో బిగుతైన ఎమోషన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి కథని నడిపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతారని చెబుతున్నారు.
సూర్య యాక్టింగ్, మమిత బైజు క్యూట్ లుక్స్, అండ్ ఎమోషనల్ యాక్టింగ్, వెంకీ అట్లూరి మేకింగ్, సినిమాటోగ్రఫీ, నాగవంశీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని విశ్వనాథ్ అండ్ సన్స్ కి మెయిన్ హైలెట్స్ గా నిలవబోతున్నాయని టాక్. అంతేకాదు చాలా కాలం తర్వాత ఫ్రెష్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని వీక్షించేలా ఈ చిత్రం ఉంది అని సినిమాని వీక్షించిన ఆడియన్స్ రిపోర్ట్.







































