రిలేషన్ లో వేధింపులు - అనుపమ
Anupama Parameswaran opens up on 2 years of narcissistic abuse
కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకసారి క్రికెటర్ తో ప్రేమలో ఉంది, ఒకసారి విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ప్రేమలో పడింది, ఎవరితో డేటింగ్ చేసినా అనుపమ పరమేశ్వరన్ సీక్రెట్ గానే డేట్ చేస్తుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎంతగా జరిగిందో అందరికి తెలుసు. అనుపమ పరమేశ్వరన్ మాత్రం డేటింగ్ రూమర్స్ ఖండించినా ఆ ప్రచారం ఆగేది కాదు.
రీసెంట్ గా ధృవ్ విక్రమ్ తో అనుపమ బ్రేకప్ ఆయనట్లుగా వార్తలు రావడం ఆమె కూడా ఆ వార్తలను ఇండైరెక్ట్ గా ధ్రువీకరించింది. తాజాగా అనుపమ రిలేషన్ షిప్ లో తనపై ఎంతగా వేధింపులు జరిగాయో చెప్పి అందరికి షాకిచ్చింది. తాను రిలేషన్ లో ఉన్న వ్యక్తి నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
రిలేషన్ లో ఉన్న రెండు సంవత్సరాలు మానసిక హింసను భరించాను. రిలేషన్ ప్రారంభంలో అందరూ ఎంతో ప్రేమ చూపిస్తారన్నారు. తను దొరకడం లక్కీ అంటూ మాట్లాడతారు కానీ తర్వాత అసలైన అపరిచితుడు బయటకు వస్తారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. అదొక టాక్సిక్ రిలేషన్ అంటూ చెప్పిన అనుపమ...
నేను నటించిన డ్రాగన్ మూవీని ప్రమోట్ కూడా చేయనివ్వలేద, ఆ రిలేషన్ వల్ల తాను డిప్రెషన్ కి లోనయ్యాను అంటూ అనుపమ పరమేశ్వరన్ తనెంతగా రిలేషన్ లో బాధపడిందో మొదటిసారి రివీల్ చేసింది.







































