ఫౌజి పై ప్రభాస్ ప్రత్యేక దృష్టి
Prabhas and his Focus on Fauzi
రాజాసాబ్ దెబ్బతో ప్రభాస్ వెకేషన్స్ ను కూడా త్యాగం చేసి తన తదుపరి సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం బాగా జరుగుతుంది. నిజంగానే అసలు బ్రేక్ తీసుకోకుండా ఫౌజి అలాగే స్పిరిట్ చిత్రాల షూటింగ్స్ ని కంప్లీట్ చేస్తున్నారు. రాజాసాబ్ విషయంలో దర్శకుడు మారుతిని ఎంతగా ట్రోల్ చేసారో.. ప్రభాస్ డేట్స్ విషయంలో, సినిమాకి సమాయన్ని కేటాయించే విషయంలో ఎంతగా కేర్ లెస్ గా ఉంటున్నారో అనే విషయంపై కూడా అంతే చర్చ జరిగింది.
అది మరోసారి రిపీట్ కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజిపై ప్రత్యేక దృష్టి పెట్టారట. అది ఎంతలా అంటే.. ఫౌజి షూటింగ్ లేకపోయినా ప్రభాస్ ఫౌజి సెట్ లోనే ఉంటున్నారట. ఆ విషయాన్ని ఇరుముడి ఈవెంట్ లో నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు.
ఫౌజి షూటింగ్ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకున్న ప్రభాస్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6.30 వరకు రోజూ ఫౌజి షూట్ లోనే ఉంటున్నట్లు గా నిర్మాత రవిశంకర్ తెలిపారు. ఈ మంగళవారం అయితే తనకు సంబందించిన షూటింగ్ ఏమీ లేకపోయినా ప్రభాస్ ఫౌజి సెట్ కి వచ్చి మానిటర్ దగ్గరే కూర్చుని జాగ్రత్తగా అన్నీ చూసుకుంటున్నట్లుగా రవిశంకర్ తెలిపారు.
మరి రవి శంకర్ చెప్పినట్లుగా ప్రభాస్ ఈసారి అభిమానులను ఎలాంటి డిజప్పాయింట్ చెయ్యరని, రాజాసాబ్ రిజల్ట్ రిపీట్ కాకుండా ఫౌజి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా అర్ధమవుతుంది.







































