వార్ కి సిద్దమవుతోన్న బావబామ్మర్దులు!
Varun Tej vs Sai Durga Tejటాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే సంక్రాంతి పండుగ సీజన్ కోసం ఇప్పటికే పలు భారీ చిత్రాలు క్యూ కట్టగా తాజాగా మెగా కుటుంబం నుంచి మరో సినిమా ఈ రేసులోకి దూసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సంబరాల ఏటి గట్టు`ను సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట ఈ సినిమాను 2025లోనే విడుదల చేయాలని ప్లాన్ చేసినా? వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో తాజాగా పండుగ సీజన్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
జనవరి 12 2027 తేదీని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశేషం ఏమిటంటే? సరిగ్గా ఇదే సెంటిమెంట్ తేదీన (జనవరి 12) విడుదలైన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ వారి `హను-మాన్` చిత్రం 2024లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లోనే సంచలనాలు సృష్టించిన ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని `సంబరాల ఏటి గట్టు` టీమ్ భావిస్తున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ కోడై కూస్తున్నాయి.
ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `భైరీ` సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందని అధికారికంగా ఖరారైంది. ఒకవేళ `సంబరాల ఏటి గట్టు` కూడా ఇదే సీజన్‌కు లాక్ అయితే మెగా అభిమానులకు పండుగ సమయంలో బ్యాక్-టు-బ్యాక్ విందు ఖాయం. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన ప్రకటించే అవకాశం ఉంది.







































