శివాజీని చూసి మైమరచిపోయిన శ్రియ!
Shriya saran on working with Rajinikanth
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన నటి శ్రియా సరన్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. బ్లాక్‌బస్టర్ సినిమా `శివాజీ` ది బాస్` చిత్రంలో రజనీకాంత్ సరసన నటించే అవకాశం వచ్చిన క్షణాలను ఎంతో ఆప్యాయంగా నెమరు వేసుకున్నారు. రజనీకాంత్ ను మొదటిసారి కలుసుకున్నప్పుడు తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని, మాటలు రాక అలాగే నిండిపోయానని తెలిపారు.
సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ సెట్స్‌లోకి రాగానే ఆయన చుట్టూ ఉన్న ఆరా, సింప్లిసిటీ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శ్రియా పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్‌గా అంత భారీ ఫాలోయింగ్ ఉన్నా? ఆయన ఎంత నిరాడంబరంగా, తోటి నటీనటులతో ఎంత ఆప్యాయంగా ప్రవర్తించేవారో వివరించారు. ఆ సమయంలో తాను పూర్తిగా స్టార్‌స్ట్రక్ (సెలబ్రిటీ క్రేజ్‌తో మైమరచిపోవడం) అయిపోయానని ఆయన ఎదుట ఎలా ప్రవర్తించాలో? కూడా మొదట్లో అర్థం కాలేదన్నారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన `శివాజీ` సినిమా శ్రియా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా ఆమెకు తమిళ చిత్రసీమలో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చిపెట్టింది. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం తన జీవితంలో ఎప్పటికీ మరువలేని గొప్ప అనుభవమని, ఒక నటిగా తన ఎదుగుదలకు ఆ సినిమా ఎంతగానో దోహదపడిందని తరచూ సందర్భం వచ్చినప్పుడు శ్రియ చెబుతూనే ఉంటారు.







































