హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్
NTR discharged, recovery time revealed
డ్రాగన్ షూటింగ్ సెట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజానికి దెబ్బ తగలడంతో సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ ఎనిమిదివారాలు రెస్ట్ తీసుకోవాలి అంటూ అప్పుడు ఎన్టీఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ హెల్త్ కండిషన్ ను షేర్ చేసింది. ఆతర్వాత ఎన్టీఆర్ కు ఎలా ఉందొ అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
తాజాగా ఎన్టీఆర్ కి కిమ్స్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ సక్సెస్ అయినట్లుగా కిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈరోజు అంటే గురువారం మధ్యాన్నం ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన సర్జరీ నుంచి కోలుకుంటున్నారు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లుగా ఎన్టీఆర్ డాక్టర్స్ టీమ్ తో ఉన్న పిక్ వదిలారు.
అయితే ఎన్టీఆర్ ఈ భుజం కి జరిగిన సర్జరీ నుంచి పూర్తిగా రికవరీ అయ్యేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది అని డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ పూర్తిగా రికవరీ అయ్యాకే ఆయన డ్రాగన్ సెట్ లోకి వెళతారని, ఈలోపు ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తారని తెలుస్తుంది.







































