ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Is director finalized for Thalaivar 173

డైరెక్టర్ల గందరగోళానికి తెరపడినట్లేనా?

Is director finalized for Thalaivar 173

 

సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా ప్రకటించినప్పటి నుండి చిత్ర పరిశ్రమలో -అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. ఈహైప్ కి ర‌జ‌నీ ఒక కార‌ణ‌మైతే? క‌మ‌ల్ హాస‌న్ మ‌రో రీజ‌న్ గా  మారారు.  ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లోకనాయకుడు  సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్- నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ 2` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదలైన తర్వాతే ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి దర్శకత్వం వహించేది ఎవరనే విషయంలో మాత్రం కోలీవుడ్ వర్గాల్లో  గందరగోళం కొనసాగుతోంది.

ఈ చిత్ర ప్రయాణం మొదలైనప్పటి నుంచి దర్శకుల కుర్చీ ఎందరో చేతులు మారింది. తొలుత  ఈ సినిమాకు  కమర్షియల్ డైరెక్టర్ సుందర్ సి పేరు ఖరారైంది. కానీ చివిరి నిమిషంలో భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేయడం వల్ల వచ్చే ఒత్తిడి కారణంగా సుందర్ సి సినిమా నుండి తప్పుకున్నారు. అటుపై `పార్కింగ్` ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ పేరు పరిశీలనలోకి వచ్చినా అది వర్కవుట్ కాలేదు. అనంతరం `డాన్` సినిమా ఫేమ్ శిబి చక్రవర్తి చెప్పిన కథ నచ్చడంతో రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక వేదికపై ఈ ప్రాజెక్టుపై ఎంతో నమ్మకంగా మాట్లాడిన శిబి చక్రవర్తి కూడా కథా చర్చల్లో వచ్చిన మార్పుల వల్ల చివరకు మారిన దర్శకుల జాబితాలోకి చేరిపోయారు.

తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్షన్ బాధ్యతలు `ఓ మై కడవులే` చిత్ర దర్శకుడు అశ్వత్ మారిము త్తుకు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అశ్వత్ పుట్టినరోజున నిర్మాణ సంస్థ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఈ ప్ర‌చారాన్ని  నిజం చేస్తూ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమాలో విలక్షణ దర్శకుడు మిష్కిన్  కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథ పూర్తిగా కొలిక్కి వచ్చే వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకూడదని కమల్ హాసన్ భావిస్తున్నా? దాదాపు అశ్వత్ మారిముత్తు పేరే ఖరారైనట్లు తెలుస్తోంది.

Who Is The Director For Thalaivar 173