ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raja Shivaji Budget Riteish Deshmukh Breaks Silence

అంకెలు కాదు.. అనుభూతి ముఖ్యం

 

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రితేష్ దేశ్‌ముఖ్ తెర‌కెక్కించిన  ప్రతిష్టాత్మక చిత్రం `రాజా శివాజీ`  ఇటీవ‌లే రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రితేష్ 100 కోట్ల బడ్జెట్ కేటాయించారంటూ  కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై రితేష్ తాజాగా స్పందించారు. బడ్జెట్ అనేది సినిమా నాణ్యతను బట్టి మారుతుంటుందన్నారు.

అయితే  అంకెలను చూసి సినిమాను అంచనా వేయడం సరికాదని  అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్ గురించి వ‌స్తోన్న‌ వార్తలను రితేష్ తోసిపుచ్చారు. `మీరు టికెట్ కోసం ఎంత చెల్లిస్తున్నారు? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఒక ప్రేక్షకుడు సినిమా చూసేటప్పుడు అది ఎన్ని కోట్లతో నిర్మించారనే దానికంటే? ఆ సినిమా ఇచ్చే అనుభూతికే ప్రాధాన్యత ఇస్తారన్నారు.

బడ్జెట్ ఎంత ఉన్నా? శివాజీ మహారాజ్ వంటి మహానుభావుడి కథను వెండితెరపై నిజాయితీగా ఆవిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని రితేష్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం త‌న‌తో పాటు టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌న్నారు. బడ్జెట్ వివరాల కంటే కంటెంట్ పైనే అందరూ దృష్టి పెట్టాలని కోరారు. ఇటీవ‌లే ఈ సినిమా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

కానీ అంచ‌నాలు అందుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా 60-70 కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. కానీ బ‌డ్జెట్ లెక్క‌లు చూస్తే 100 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు అయింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి నెట్టింట సినిమాఉ అయిన ఖ‌ర్చు ఎంత అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. అయినా?  రితేష్ దేశ్ ముఖ్ బడ్జెట్ ఎంత అయింద‌న్న‌ది మాత్రం క్లారిటీగా చెప్ప‌లేదు.

Riteish Deshmukh shuts down rumoursRaja Shivaji Budget Riteish Deshmukh Breaks Silence