మెట్ గాలా 2026 : రియాలిటీ స్టార్ లుక్ వైరల్

ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే బోర్ కొడుతుంది. వేదికలపై ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలి. ఫ్యాషన్ ని పరాకాష్ఠకు చేర్చాలి. అప్పుడే యూత్ వెంటపడుతుంది. డజన్ల కొద్దీ కెమెరాలు వెంబడిస్తుంటాయి. అయితే అలాంటి ఫ్యాషన్ సెన్స్ తనకు మాత్రమే సాధ్యమని నిరూపిస్తోంది కిమ్ కర్ధాషియన్. ఈ రియాలిటీ క్వీన్ ఇంతకుముందు అంబానీల పెళ్లిలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కొన్ని రోజుల పాటు తన సోదరి ఖోలే కర్ధాషియన్ తో కలిసి సందడి చేసారు. ఆ సమయంలో ఒక ఖరీదైన నెక్లెస్‌ని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు మెట్ గాలా 2026లో కిమ్ కర్ధాషియన్ లుక్ అంతర్జాలంలో పెద్ద చర్చగా మారింది. కిమ్ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో మతులు చెడగొట్టింది. ఈ లుక్ కోసం కొన్ని రోజుల పాటు తన విలువైన సమయాన్ని వెచ్చించింది కిమ్. డజన్ల కొద్దీ కెమెరాలన్నీ తనవెంట పడ్డాయి. తననే ఫ్లాష్‌లలో ముంచెత్తాయి.
బుట్ట బొమ్మలా గాజు బొమ్మలా లేదా మర బొమ్మలా .. భారీతనం నిండిన డిజైనర్ దుస్తులలో చాల మంది అందగత్తెలు మెట్ గాలా ఈవెంట్లో దర్శనమిచ్చినా కిమ్ లుక్ పూర్తి యూనిక్ గా మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఈ లుక్ మునుపెన్నడూ చూడలేదే అంటూ ఫ్యాన్స్ హుషారుగా కామెంట్లు చేస్తున్నారు. మెట్ గాలా- 2026 వేడుక కోసం కిమ్ కర్దాషియన్ సిద్ధమైన తీరు... దాని వెనుక జరిగిన ఆసక్తికరమైన పరిణామాలు మీరే గమనించండి. ప్రసిద్ధ బ్రిటిష్ పాప్ ఆర్టిస్ట్ అలెన్ జోన్స్‌ను తన ఫిట్టింగ్‌కు ఆహ్వానించిన కిమ్, ఆయన కళాఖండాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.








































