మ‌హేష్‌-ప్ర‌భాస్ తో సంచ‌ల‌న చిత్రం!

 

అగ్ర హీరోలు సూపర్ స్టార్ మహేష్ -రెబల్ స్టార్ ప్రభాస్ ల‌ను ఒకే తెరపై  చూడాలని కోట్లాది మంది అభిమానులు  ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో  ఈ కలను నిజం చేస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు  తెలిసింది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా దీనిని తీర్చిదిద్దాలని వంశీ పక్కా ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం.

వంశీ పైడిపల్లికి మహేష్ , ప్రభాస్ ఇద్దరితోనూ మంచి అనుబంధం ఉంది. ప్రభాస్‌తో `మున్నా`, మహేష్‌తో `మహర్షి` వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన వంశీ ఇప్పుడు  ఇద్ద‌రి ఇమేజ్‌కు సరిపోయే  పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారుట‌. ప్రస్తుతం మహేష్  రాజమౌళి ప్రాజెక్టుతో, ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా  ఉన్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే అది భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద చిత్రంగా నిలుస్తుందన‌డంలో సందేహం లేదు.  ప్రస్తుతం వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అనంత‌రం వంశీ పూర్తి స్థాయిలో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంపై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది.  ఇప్ప‌టికే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేసిన అనుభ‌వం వంశీకి ఉంది. అదే కాన్పిడెన్స్  తో మ‌హేష్‌- ప్ర‌భాస్ ల‌ను డైరెక్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.
 

Crazy Multi Starrer On CardsMulti Starrer With Mahesh And Prabhas