మ‌న పాన్ ఇండియా స్టార్ల‌కు చిక్కుతాడా?

ధురంధర్, ధురంధర్ 2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్లకు హాట్ ఫేవరెట్‌గా మారారు. గతంలో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ `ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ`ను ప్రభాస్‌తో తెరకెక్కిస్తారని, ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో చర్చలు జరిపారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మన స్టార్ హీరోలు సైతం ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్‌కు ముగ్ధులై ఆయనతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నా.. కొన్ని అంశాల్లో కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. మరోవైపు రణవీర్ సింగ్‌ను తన ల‌క్కీ మ‌స్క‌ట్ గా భావిస్తున్న ఆదిత్య ధర్.. తన తదుపరి భారీ చిత్రాన్ని కూడా ఆయనతోనే చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ రణవీర్ సింగ్‌తో ఆదిత్య ధర్ కొత్త ప్రాజెక్ట్ ఖరారైతే అది అసాధార‌ణ‌ కాన్సెప్ట్‌తో ఉండబోతోందని సమాచారం. రణవీర్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ఒక లార్జర్ దన్ లైఫ్ పాత్రలో ఆవిష్కరిస్తూ.. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ఈ సినిమాను నిర్మించాలనేది ఆదిత్య ధర్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారతీయ సినిమాకు, హాలీవుడ్‌కు మధ్య అన్ని కోణాల్లోను అంతరం తగ్గిపోతున్న తరుణంలో ఆదిత్య ధర్ ప్రపంచ దేశాల్లో పోటీ పడే చిత్రాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ర‌ణ్ వీర్ సింగ్ తో ది ఇమ్మోర్ట‌ల్ ఆప్ అశ్వ‌త్థామ‌నే తెర‌కెక్కిస్తారా? అన్న‌దానికి ఇంకా స‌మాధానం లేదు. భారతీయ సినిమా ఖ్యాతిని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి నిలబెట్టేందుకు అత‌డు ప్ర‌య‌త్నిస్తాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Director Aditya Dhar-Pan India StarsDirector Aditya Dhar