ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Balayya-Koratala movie backdrop revealed

బాలయ్య-కొరటాల సినిమా నేపథ్యం అదేనా

అసలు ఎవరూ ఊహించని కాంబినేషన్స్ పట్టాలెక్కుతున్నాయి. అందులో కొరటాల దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ నటించడం. నిజంగా ఇది ఊహకి కూడా అందని కాంబినేషన్. దేవర 2 కోసం వెయిట్ చేస్తున్న కొరటాల సైలెంట్ గా బాలయ్యను కలిసి కథ చెప్పి ఓకే చేయించుకోవడం..

ఆతర్వాత బాలయ్య-కొరటాల కాంబో అనౌన్సమెంట్ రావడం, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగష్టు నుంచి పట్టాలెక్కబోతుంది అనే వార్తలు నందమూరి అభిమానులకు కునుకు రానివ్వడం లేదు. కొరటాల బాలయ్య కు ఏం చెప్పి ఒప్పించారనే విషయంలో ఇంకా అభిమానుల్లో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో కొరటాల బాలయ్య ను మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేయబోతున్నారట.

కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని, ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. బాలయ్య ను పూర్తిస్థాయి మాస్ అవతార్ లో కొరటాల చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి దేవర పై వచ్చిన విమర్శల నేపథ్యంలో కొరటాల బాలయ్య తో ఎలాంటి సినిమా తీసి నిరూపించుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. 

Balayya-Koratala movie upateBalayya-Koratala movie backdrop revealed