ముంచినా - తేల్చినా అభిమానమే

హీరోలను స్టార్స్ ని చేసినా, పాన్ ఇండియా హీరోస్ గా మార్చినా అది కేవలం అభిమానుల వలనే. నట వారసులకైనా కష్టపడితేనే అభిమానము దక్కుతుంది. ఒక్కో హీరో ఒక్కో ఫ్యాన్ బేస్ ని మైంటైన్ చేస్తారు. తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్క హీరోకి అభిమానులు ఉన్నారు.

మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఆ అభిమానమే హీరోలను ముంచినా, తేల్చినా. అంటే మెగాస్టార్ చిరు అభిమానులను నమ్ముకునే రాజకీయ అరంగేట్రం చేసారు. ఆయన్ని అభిమానులు సగమే నమ్మారు. సినిమాల్లో ఆరాదించినా రాజకీయాల్లో చిరుకి మెగా ఫ్యాన్స్ పట్టం కట్టలేకపోయారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులను నమ్ముకుని రాజకీయ అరంగేట్రం చేసారు. పదేళ్ళపాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని రాజకీయంగా ముంచేశారు. సినిమాల్లో విపరీతంగా అభిమానించిన పవన్ ని రాజకీయంగా మాత్రం సపోర్ట్ చేయలేకపోయారు. పదేళ్లపాటు పవన్ రాజకీయాల్లో పోరాడాల్సి వచ్చింది.

ఇక తమిళనాట విశేష అభిమాన గణం ఉన్న హీరో విజయ్ రెండేళ్ల క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయ్ ని ఆయన అభిమానులు ఏ మాత్రం డిజప్పాయింట్ చెయ్యలేదు. మొట్టమొదటి ఎలక్షన్స్ లోనే విజయ్ ని సీఎం ని చేసేసారు. ఇదంతా అభిమానుల వల్లే జరగకపోయినా.. మేజర్ క్రెడిట్ అభిమానులకే ఇవ్వాలి. అభిమానం లేకపోతె ఎవ్వరూ విజయ్ కి ఓటు వెయ్యరు.

అందుకే అనేది స్టార్స్ ని ముంచినా, తేల్చినా అంతా అభిమానమే కారణం అని. మరి హీరో విజయ్ గెలుపు చూసి మరెంతమంది ఇకపై రాజకీయాల్లోకి వస్తారో చూడాలి.

FansHero Fans