ప్రముఖ నిర్మాత దుర్మరణం

ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి అకాల మరణం సినిమా ఇండస్ట్రీని శోక సముద్రంలోకి నెట్టేసింది. నిర్మాత ఆర్.బి.చౌదరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం పై అందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అధినేత ఆర్.బి.చౌదరి మృతి చెందడంపై అందరిని షాక్ కి గురిచేసింది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు ఆయన 90కి పైగా సినిమాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Producer RB Choudary passes away due to car crashVeteran producer RB Choudary has passed away








































