నేనే రాజు నేనే మంత్రి సీన్ రిపీట్

రానా హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా లోని ఓ ఎపిసోడ్ ని కోలీవుడ్ హీరో విజయ్ రియల్ గా చేసి చూపించారు. ఆ చిత్రంలో కాజల్ అగర్వాల్ చనిపోయిన్నప్పుడు ఆ ఎలక్షన్స్ లో రానా పోటీ చేస్తూ తన నియోజకవర్గాల్లోని అభ్యర్థుల కోసం డప్పు కొట్టేవాళ్లను, ఇంకా మంగలి పని చేసుకునేవాళ్లను నిలబెట్టి విజయం సాధించాడు.
ఇప్పుడు అదే మాదిరి నిజ జీవితంలో హీరో విజయ్ తన పార్టీ టీవీకే నుంచి ఆటో డ్రైవర్ ని, కారు డ్రైవర్ కొడుకుని, పనిమనిషిని ఎమ్యెల్యేలుగా నిలబెట్టి విజయం సాధించారు. తమిళనాట రీసెంట్ గా జరిగిన అసెంబీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ నుంచి ఇలా ఆటో డ్రైవర్, కారు డ్రైవర్ కొడుకు, పనిమనిషిని అభ్యర్థులుగా నిలబెట్టారు.
వారు విజయ్ సపోర్ట్ తో గెలవడం చూసి రానా నేనే రాజు నేనే మంత్రి సీన్ ని విజయ్ రియల్ గా రిపీట్ చేసారంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.








































