Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-నవీన్ చంద్ర

Tue 03rd Nov 2015 12:27 AM
naveen chandra,tripura movie,swathi,rajakiran  సినీజోష్ ఇంటర్వ్యూ-నవీన్ చంద్ర
సినీజోష్ ఇంటర్వ్యూ-నవీన్ చంద్ర
Advertisement

స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వంలో చినబాబు నిర్మిస్తున్న చిత్రం త్రిపుర. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 6 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్రతో సినీజోష్ ఇంటర్వ్యూ.. 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి..?

సినిమాలో నా పాత్ర పేరు నవీన్ చంద్ర. ఒక సైక్రియార్టిస్ట్ గా నటిస్తున్నాను. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఒక మానసిక వైద్యుడిగా, భర్తగా మాత్రమే కాకుండా నా పాత్రలో మరో వైవిధ్యమైన కోణం కూడా ఉంది. నా కళ్లు నచ్చి నన్ను ఈ పాత్ర కోసం దర్శకుడు రాజ్ కిరణ్ ఎంపిక చేసుకొన్నారు. 

త్రిపుర టైటిల్ రోల్ పోషిస్తున్న స్వాతి గురించి చెప్పండి..?

త్రిపుర సినిమాలో స్వాతిది చాలా టిపికల్ రోల్. కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. తప్పు చేస్తే భర్తను సైతం క్షమించని మనస్తత్వం కలది. అలాంటి ఒక అమ్మాయి జీవితంలో ఆమె కన్న కల ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది అనేది ఈ సినిమా కథ. స్వాతి చాలా అద్భుతంగా నటించింది. 

స్వాతి తో నటించడం ఎలా అనిపించింది..?

త్రిపుర సినిమాలో స్వాతి హీరోయిన్ అని తెలిసాక. ఆమె నటనలో నాకంటే సీనియర్ కదా.. ఆమెతో కలిసి ఎలా నటించాలా అని మొదట్లో టెన్షన్ పడ్డాను. అయితే.. ఆమె నాతో ఎంతో హుందాగా కలిసిపోయింది. భార్యాభర్తలుగా మా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. 

సినిమా పెళ్లి సీన్ లో నటించడం ఎలా అనిపించింది..?

మండపంలో కూర్చునేంతవరకూ బాగానే ఉన్నా.. సెట్ లో హడావుడి మొదలయ్యేటప్పటికి, నిజంగానే పెళ్లి జరిగిపోతుందా? అనిపించింది. మా ఇంట్లో నా ఇద్దరి చెల్లెళ్ల పెళ్లిళ్లు చూసినప్పటికీ.. ఇదే నా మొదటి పెళ్లి సన్నివేశం కావడంతో చాలా టెన్షన్ పడ్డాను. ఇక తాళి కట్టమని చెప్పగానే నా కాళ్లూ, చేతులూ వణికిపోయాయి. నాతోపాటు స్వాతి కూడా భయపడింది. అయినా కూడా ఆ సీన్ ని సింగిల్ టేక్ లో ఫినిష్ చేసాం. 

త్రిపుర కూడా రెగ్యులర్ హారర్ చిత్రమా..?

హారర్ సినిమా అనగానే రాత్రి 12 అవ్వగానే దెయ్యం రావడం, అందరూ భయపడడం జరుగుతుంటుంది. కానీ త్రిపుర సినిమాలో హారర్ ఎలిమెంట్స్ కొంచెం కొత్తగా ఉంటాయి. కథలో లీనమై ప్రేక్షకులు భయపడుతుంటారు. సో త్రిపుర ప్రేక్షకులకు తప్పకుండా ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. 

క్యారెక్టర్ కోసం ఏమైనా హోం వర్క్ చేసారా..?

సాధారణంగా డాక్టర్లంటే.. క్లీన్ షేవ్ చేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని చాలా నీట్ గా ఉంటారు. డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు నాకు మొదట డాక్టర్ రోల్ అనగానే.. క్లీన్ షేవ్ చేసుకోవాలా అని అడిగాను. వెంటనే ఆయన గెడ్డం మాత్రం తీయకండి అన్నారు. అప్పుడు బెంగుళూరులో ఉన్న నా డాక్టర్ ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్లి ఒక వారం రోజులు అబ్జర్వ్ చేసాను. ఆ హోమ్ వర్క్ నాకు నా క్యారెక్టర్ విషయం చాలా హెల్ప్ అయ్యింది. 

సినిమాలో ఆర్టిస్టుల గురించి..?

త్రిపుర సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకొంటుంది. రావు రమేష్ గారు, షకలక శంకర్, సప్తగిరి, పూజ ఇలా అందరి పాత్రలూ సినిమాకి చాలా కీలకం. ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా షకలక శంకర్, సప్తగిరిల కామెడీ సినిమాకి హైలిట్ గా నిలుస్తుంది. 

తదుపరి చిత్రాలు..?

త్రిపుర తర్వాత వచ్చే నెల లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు కాకుండా మరే చిత్రమూ అంగీకరించలేదు. కేవలం నా పాత్ర మాత్రమే కాకుండా కథ కూడా బాగుంటేనే సినిమా ఒప్పుకోవాలని ఫిక్స్ అయ్యాను.  

పెళ్ళెప్పుడు..? 

పెళ్లి ఫిక్సయ్యింది. అమ్మాయి ఎవరనేది త్వరలోనే చెబుతాను. ప్రస్తుతానికి కెరీర్ సాఫీగానే సాగుతున్నప్పటికీ.. ఒక నటుడిగా పూర్తి స్థాయిలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకొందామనుకొంటున్నాను. అన్నీ కుదిరితే అతి త్వరలోనే నా నుంచి మీకు పెళ్లి పిలుపు అందుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement