Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> All set for grand NDA victory celebrations in Tirupati today

కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలు

All set for grand NDA victory celebrations in Tirupati today

 

కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ 24 నెలల సమయంలో కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల కోసం చేసిన అభివుద్ది పనులు, సూపర్ సిక్స్ పథకాల అమలు, కూటమి ప్రభుత్వం పెట్టుబడులను రక్షించేందుకు చేసిన కృషి, విద్యార్థుల పట్ల కూటమి ప్రభత్వం చేసిన సంక్షేమ పథకాలు, క్యాబినేట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, కూటమి ప్రభుత్వం సాధించిన మైలురాళ్లు, ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది.

అందులో ఈరోజు జూన్ 12 న తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు భారీగా తరలి రాబోతున్నారు. ఈ సభలో మిత్రులుగా అధికారంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-మంత్రి నారా లోకేష్ లు ఈ సభలో...

ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణ, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షించడం వంటి కీలక అంశాలపై మాట్లాడబోతున్నారు. తిరుపతి పరిధిలో సుమారు 20 ఎకరాల సువిశాల స్థలంలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఈ సభ సక్సెస్ అవ్వగానే అమరావతి, విశాఖపట్నం పట్టణాల్లో కూడా ఈ తరహా సభలను నిర్వహించాలని, తాము చేసిన మంచిని ప్రజలకు వివరంగా చాటి చెప్పాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. 

AP NDA govt marks 2 years in power with a massive public meeting in Tirupati