Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raghava Lawrence announces entry into politics

ఫ్యాన్స్ చేతిలో లారెన్స్ పొలిటికల్ కెరీర్

Raghava Lawrence announces entry into politics


తమిళనాట స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ, ఆయన విజయం చూసాక చాలామంది నటులు రాజకీయ రంగప్రవేశం పై ఆలోచనలో పడినట్లుగానే కనిపిస్తుంది. రీసెంట్ గా రాఘవ లారెన్స్ విజయ్ టీవీకే పార్టీలో చేరి విజయ్ వదులుకున్న ఈస్ట్ తిరుచ్చి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

లారెన్స్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, ఆయన వచ్చినా ఇక్కడ సక్సెస్ అవుతారు. కారణం రాఘవ లారెన్స్ ఎన్నో సామజిక కార్యక్రమాల్లో ఉన్నారు. ఎంతోమందికి అన్నం పెడుతున్నారు, పిల్లలను చదివిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా నిలబడగలుగుతారు అంటున్నారు.

ఈలోపే లారెన్స్ కూడా పొలిటికల్ ఎంట్రీ పై తనదైన స్టయిల్లో స్పందించారు. మరోపక్క అన్నామలై పెట్టబోయే కొత్త పార్టీలోకి లారెన్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసారు. ఏం నిర్ణ‌యం తీసుకోవాలో మీరే చెప్పండి.. అంటూ ఆయన రాజకీయ భవితవ్యాన్ని అభిమానుల చేతుల్లో పెట్టారు..

ర‌మ్మంటే రాజ‌కీయాల్లోకి వ‌స్తాను. లేదంటే లేదు.. ఇలానే నా సేవ నేను చేసుకొంటా అంటూ అభిమానులను అడిగారు. మరి లారెన్స్ రాజకీయాల్లో ఎదగాలి అంటే అభిమానుల సపోర్ట్ అవసరమని ముందే గుర్తించి ఆయన తన పొలిటికల్ కెరీర్ ని ఫ్యాన్స్ చేతిలో పెట్టారు. 

Raghava Lawrence says his political entry