Advertisement

OG 2 పై క్రేజీ న్యూస్

Exciting info on OG2


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజిత్ కలయికలో తెరకెక్కి గత ఏడాది విడుదలైన #OG చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. అయితే OG కి హిట్ టాక్ వచ్చినా నష్టాలు వచ్చాయన్నారు. దానితో #OG2 అటకెక్కింది, దానయ్య మళ్లీ పవన్ జోలికి వెళ్లరనే ప్రచారము జరిగింది. ప్రస్తుతం పవన్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకునే మూడ్ లేరు. దానితో OG 2పై పవన్ ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు.

కానీ ఇపుడు హఠాత్తుగా #OG2 పై పవన్ కళ్యాణ్ సైడ్ నుంచే క్రేజీ అప్ డేట్ అందించారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి #OG2పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సుజిత్ విదేశాలకు వెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన వస్తారు.. ఆ టైమ్ ఆయనే ఫిక్స్ చేస్తారు. సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే #OG2 గురించి చర్చిస్తాం అంటూ ట్వీట్ పడింది.

దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. ఓజస్ గంభీరా గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన సుజిత్ #OG2పై కసరత్తులు స్టార్ట్ చేసారని, విదేశాలకు కూడా ఆయన #OG2 లొకేషన్స్ సెర్చింగ్ కోసమే వెళ్లారని అంటున్నారు. చూద్దాం #OG2ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది.

Makers share interesting update on OG2