Advertisement

ఇక ఈ హీరోయిన్ కోలుకోవడం కష్టమే

One more Shock for Pooja Hegde


ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ చైర్ కి దగ్గరై రష్మిక నుంచి గట్టి పోటీని ఎదుర్కున్న బుట్టబొమ్మ పూజ హెగ్డే కి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్, బాలీవుడ్ అన్ని షాక్ ల మీద షాక్ లిస్తూ వస్తున్నాయి. రెండేళ్ల బ్రేక్ తో కోలీవుడ్ లో కమ్ బ్యాక్ అయిన పూజ హెగ్డే తమిళనాట సక్సెస్ దొరకలేదు.

మరోపక్క హిందీలో చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఆమెకు హెల్ప్ అవ్వలేదు సరికదా అవి ఆమెను మరింతగా వెనక్కి నెట్టేస్తున్నాయి. రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వరుణ్ ధావన్ జంటగా పూజ హెగ్డే నటించిన హై జవాని తో ఇష్క్ హోనా హై కూడా పూజ హెగ్డే ను బాగా డిజప్పాయింట్ చేసింది.

హై జవాని తో ఇష్క్ హోనా హై హిట్ అంటూ పోస్టర్స్ వేస్తున్నా ఇంకా ఈ చిత్రం 100 కోట్ల మార్క్ చేరలేదు. అంటే ప్లాప్ లిస్ట్ లోకి వెళుతుంది. అయినప్పటికీ పూజ హెగ్డే చేతిలో ఉన్న జన నాయగన్ విడుదల కావాల్సి ఉండగా.. రాఘవేంద్ర లారెన్స్ కాంచన 4లో, దుల్కర్ సల్మాన్ చిత్రంలో పూజ హెగ్డే నటిస్తుంది.

ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న ఒక్క సక్సెస్ లేకపోతె కెరీర్ లో కష్టమైపోతుంది. ఏదైనా పూజ హెగ్డే ఇకపై కోలుకోవడం కష్టమే అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Hai Jawani Toh Ishq Hona Hai box office collection