Advertisement

హీరోని చేస్తామ‌ని 3.5 కోట్లు కొట్టేసిన మాయ‌గాళ్లు!

Hero Scam In Hyderabad

చిత్రసీమలో అడుగుపెట్టి తన వారసుడు స్టార్‌గా వెలిగిపోవాలనే ఒక తండ్రి బలహీనతను ఎన్ క్యాష్ చేస్కుంది ఒక ఘ‌రానా జంట‌. తాము ఫిలింమేకింగ్ లో తోపులం అంటూ అబద్ధాలు చెప్పిన ఒక ముఠా.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడిని తమ మాయమాటలతో బుట్టలో వేసుకుంది. బాధితుడి కొడుకును వెండితెరకు పరిచయం చేసి అగ్ర శ్రేణి నటుడిగా తీర్చిదిద్దుతామని.. అందుకు ప్రతిఫలంగా సినిమా నిర్మాణ బ‌డ్జెట్ మూడున్న‌ర కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని నమ్మబలికారు. ఈ డ‌బ్బుపై లాభాల్లో భారీ వాటా ఇస్తామంటూ నకిలీ అగ్రిమెంట్లు చూపించడంతో.. సదరు వృద్ధుడు తన కుమారుడి కెరీర్ బాగుంటుందనే ఆశతో గత రెండేళ్లలో విడతల వారీగా దాదాపు 3.5 కోట్ల వరకు ఆ మోస‌గాళ్ల చేతుల్లో పెట్టారు.

కానీ కాలం గడుస్తున్నా కనీసం షూటింగ్ ప్రారంభ సూచనలు కూడా కనిపించకపోవడంతో... తాను నిట్ట‌నిలువునా దోపిడీకి గురయ్యానని ఆ వృద్ధ తండ్రి ఆలస్యంగా గుర్తించారు. నష్టపోయిన సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందిగా సదరు దంపతులు కం ముఠా స‌భ్యుల‌ను నిలదీయగా... ఆ మోసగాళ్లు అసలు స్వరూపాన్ని బయటపెట్టి యువకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ కూక‌ట్ ప‌ల్లి పోలీస్ ని ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు సినీ రంగ ప్రవేశం పేరుతో జీవితాంతం కష్టపడి దాచుకున్న కోట్లాది రూపాయల సంపదను కోల్పోవడమే కాకుండా.. ఇప్పుడు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ మరింత ఆర్థిక భారంతో సదరు కుటుంబం అగచాట్లు పడుతోంది. వెండితెరపై మెరవాలనే కలలు కనేవారు ఇలాంటి ముఖపరిచయం లేని అపరిచితుల మాయాజాలాన్ని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కొడుకుని హీరోని చేస్తామ‌ని 3.5 కోట్లు కొట్టేసిన మాయ‌గాళ్లు!

చిత్రసీమలో అడుగుపెట్టి తన వారసుడు స్టార్‌గా వెలిగిపోవాలనే ఒక తండ్రి బలహీనతను ఎన్ క్యాష్ చేస్కుంది ఒక ఘ‌రానా జంట‌. తాము ఫిలింమేకింగ్ లో తోపులం అంటూ అబద్ధాలు చెప్పిన ఒక ముఠా.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడిని తమ మాయమాటలతో బుట్టలో వేసుకుంది. బాధితుడి కొడుకును వెండితెరకు పరిచయం చేసి అగ్ర శ్రేణి నటుడిగా తీర్చిదిద్దుతామని.. అందుకు ప్రతిఫలంగా సినిమా నిర్మాణ బ‌డ్జెట్ మూడున్న‌ర కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని నమ్మబలికారు. ఈ డ‌బ్బుపై లాభాల్లో భారీ వాటా ఇస్తామంటూ నకిలీ అగ్రిమెంట్లు చూపించడంతో.. సదరు వృద్ధుడు తన కుమారుడి కెరీర్ బాగుంటుందనే ఆశతో గత రెండేళ్లలో విడతల వారీగా దాదాపు 3.5 కోట్ల వరకు ఆ మోస‌గాళ్ల చేతుల్లో పెట్టారు.

కానీ కాలం గడుస్తున్నా కనీసం షూటింగ్ ప్రారంభ సూచనలు కూడా కనిపించకపోవడంతో... తాను నిట్ట‌నిలువునా దోపిడీకి గురయ్యానని ఆ వృద్ధ తండ్రి ఆలస్యంగా గుర్తించారు. నష్టపోయిన సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందిగా సదరు దంపతులు కం ముఠా స‌భ్యుల‌ను నిలదీయగా... ఆ మోసగాళ్లు అసలు స్వరూపాన్ని బయటపెట్టి యువకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ పోలీస్ ని ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు సినీ రంగ ప్రవేశం పేరుతో జీవితాంతం కష్టపడి దాచుకున్న కోట్లాది రూపాయల సంపదను కోల్పోవడమే కాకుండా.. ఇప్పుడు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ మరింత ఆర్థిక భారంతో సదరు కుటుంబం అగచాట్లు పడుతోంది. వెండితెరపై మెరవాలనే కలలు కనేవారు ఇలాంటి ముఖపరిచయం లేని అపరిచితుల మాయాజాలాన్ని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Hero Scam In Hyderabad, Rs 3.5 Cr Looted!