అక్కినేని ఫ్యాన్స్ ని ఆపేదెవరు
Lenin is coming to hit hard - Akkineni fans
అవును అక్కినేని ఫ్యాన్స్ ని ఆపేదెవరు. అక్కినేని హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. కానీ వాటికన్నా కూసింత ఎక్కువ అఖిల్ లెనిన్ పై కనిపిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అక్కినేని అభిమానులు లెనిన్ పై వేసే ట్వీట్ల వర్షమే కనిపిస్తుంది.
ఈ నెల 26 న రాబోయే లెనిన్ పై అక్కినేని ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. లెనిన్ తో భారీ హిట్ కొట్టాలని అభిమానుల ఆకాంక్ష. ఏజెంట్ తర్వాత మూడేళ్లకు మళ్ళి లెనిన్ తో అఖిల్ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. అందుకే వారు అఖిల్ విజయం పై అంతగా ఆశ పడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న లెనిన్ టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యి అభిమానులకు కనెక్ట్ అయ్యింది. అఖిల్ లుక్స్, భాగ్యశ్రీ బోర్సే అందాలు, అలాగే థమన్ మ్యూజిక్ అన్ని అభిమానులను ఇంప్రెస్స్ చేసాయి. ఇప్పుడు రాబోయే ట్రైలర్ పై అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. సోషల్ మీడియాలో అభిమానుల హంగామా చూస్తుంటే ఈసారి అక్కినేని ఫ్యాన్స్ ని ఆపేదెవరు అంటారు.








































