నెగెటివ్ ప్రచారం పై నారా లోకేష్ స్ట్రాంగ్ రిప్లై


ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లినా, క్రికెట్ చూడ్డాడనికి వెళ్లినా, లేదంటే అమరావతి టు హైదరాబాద్ తిరిగినా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ప్రయాణాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ని, అలాగే మంత్రి నారా లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారు.

తాజాగా నారా లోకేష్ తన ప్రయాణ ఖర్చుల విషయంలో ప్రతిపక్షానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ క్లస్టర్‌, యూనిట్ ఇన్‌చార్జులతో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో లోకేష్ చేసిన కామెంట్స్ ప్రతిపక్షానికి దిమ్మతిరిగేలా చేసాయి. తాను కానీ, తన తండ్రి కానీ ఎక్కడికి వెళ్లాలన్నా తమ సొంత వాహనాలు వినియోగిస్తామని..

కేవలం విదేశీ పర్యటనలకు, వ్యక్తిగత పర్యటనలకు మాత్రమే కాదు, ఆఖరికి ప్రభుత్వ పర్యటనలకు కూడా మా సొంత వాహనాలు వినియోగిస్తున్నామని, దాని కోసం మా సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నాం. మేము ప్రజలకు, పార్టీకి పూర్తి జవాబుదారీగా ఉంటున్నాం. కానీ ప్రత్యర్థులు పనిగట్టుకుని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నెగెటివ్ ప్రచారాన్ని కార్యకర్తలు తక్షణమే తిప్పికొట్టాలి అంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చెయ్యడమే కాదు.. పనిలో పనిగా ప్రతిపక్షానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. 

TDP Leader Nara Lokesh Counter To Opposition PartyNara Lokesh Counter To Opposition