వెలవెలబోతున్న థియేటర్లు

సమ్మర్ లో పెద్ద సినిమాలు లేవు, ఆడియన్స్ అల్లాడిపోతున్నారు. మే మొత్తం చిన్న సినిమాల్తో కరిగిపోతుంది. మే డే లాంగ్ వీకెండ్ గాయపడ్డ సింహం, జెట్ లీ రెండు సినిమాలు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసాయి. ఈ వారం కూడా చిన్న సినిమాలే వస్తున్నాయి. సమంత మా ఇంటి బంగారమన్నా మే 15 కి వస్తుంది అనుకుంటే అది పోస్ట్ పోన్ అయ్యింది.
ఇక జూన్ 4 పెద్ది వచ్చేవరకు ఈ థియేటర్స్ వెలవెల ఇలానే ఉండేలా ఉంది. రామ్ చరణ్ పెద్ది మళ్లీ థియేటర్స్ కి కళ తెచ్చేలా కనిపిస్తుంది. పెద్ది వచ్చేవరకు సమ్మర్ బోర్ కొట్టించేస్తుంది. ఆడియన్స్ సినిమాలు లేక అల్లాడిపోతున్నారు. కాసేపు అలా వెళ్లి సినిమా చూసొద్దామంటే అదిరిపోయే క్రేజ్ ఉన్న సినిమాలు రావడం లేదు.
మే ని పెద్ద సినిమాలన్నీ వదిలేసాయి. ఎక్కువగా ఆగస్టు లేదంటే దసరా మీద ఫోకస్ పెట్టి సమ్మర్ సెలవులను వదిలేసారు. కేవలం చిన్న సినిమాలు వస్తున్నాయి. అవి కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. మంచి సినిమాలు లేక, ఆడియన్స్ రాక థియేటర్స్ అన్ని వెలవెలబోతున్నాయి.








































