ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bomb threat to Amitabh Bachchan’s house

అమితాబ్ ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు

Bomb threat to Amitabh Bachchan’s houseBomb threat to Amitabh Bachchan’s house


గతంలో బాంబ్ బెదిరింపులు వస్తే పోలీసులు వచ్చి కూల్ గా తనిఖీలు చేసి ఆదో ర్యాండమ్ కాల్, ఆ కాల్ అంతా అబద్దమని చెప్పి చక్కగా వెళ్ళిపోయేవారు. కానీ ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న పరిణామాలు సెలబ్రిటీస్ ని వణికిస్తున్నాయి. రీసెంట్ గా సల్మాన్ టార్గెట్ గా సాగిన గన్ పేలుళ్లు టైగర్ ష్రాఫ్ ని గాయపరిచాయి.

టైగర్ ఒంటిపై గాయాలు, ఆయన డ్రైవర్ కి తగిలిన గాయాలు సంచలనం సృష్టించాయి. ఆతర్వాత సల్మాన్ వంటి స్టార్స్ తమ భద్రత కోసం సెక్యూరిటీ సిబ్బందిని పెంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ అయితే వారం వారం ఫ్యాన్స్ ని కలిసే సందర్భంలో బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనుక అభిమానులకు అభివాదం చేసారు.

తాజాగా బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడమే కాదు. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం సృష్టించింది. అమితాబ్ బచ్చన్ ముంబై నివాసం జల్సాను బాంబుతో పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపులు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మరి గతంలో అయితే ఈ మెయిల్ వేరేలా ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఇలాంటి ఈ-మెయిల్స్ వల్ల ఒణుకుపుడుతుంది. 

Amitabh Bachchan Bomb Threat