ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kaala Bhairava and Kavya Kalyanram Wedding Preparations Begin

కాలభైరవ-కావ్య కల్యాణ వేడుకలు

Kaala Bhairava and Kavya Kalyanram Wedding Preparations BeginKaala Bhairava and Kavya Kalyanram Wedding Preparations Begin

 

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ గ్రహీత కీరవాణి పెద్ద కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ నటి కావ్య కళ్యాణ్ తో ప్రేమలో ఉన్నాడు. రీసెంట్ గానే తమ ప్రేమను వ్యక్తపరిచారు. పెద్దల అంగీకారంతో పెళ్ళికి రెడీ అయిన ఈజంట సింపుల్ గా నిశ్చితార్ధం చేసుకోవడమే కాదు.. అప్పుడే పెళ్లి వేడుకలను మొదలు పెట్టేసారు.

కీరవాణి, కావ్య ఇరు కుటుంబాల నడుమ కావ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టేసారు. కావ్య ఇంట జరిగిన ఈ వేడుకకు కీరవాణి కుటుంబంతో పాటు రాజమౌళి, ఆయన భార్య రమ కూడా పాల్గొని కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. ఆ ఫోటో ను కావ్య తండ్రి సోషల్ మీడియాలో షేర్ చేసారు.

వచ్చే నెలలో కాలభైరవ-కావ్య కళ్యాణ్ రామ్ వివాహాన్ని జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించడంతో కాల భైరవ-కావ్య కళ్యాణ్ రామ్ కల్యాణ వేడుకలు అఫీషియల్ గా మొదలైపోయాయి. 

Kaala Bhairava, Kavya Kalyanram Wedding