రెండు సినిమాలకు రెండు తలనొప్పులు

Aadarsha Kutumbam vs CultAadarsha Kutumbam vs Cult


రేపు శుక్రవారం విడుదల కాబోయే రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆదర్శ కుటుంబం, కల్ట్ చిత్రాలు. అక్టోబర్ 30 న క్లాస్ మూవీ, మాస్ మూవీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వెంకీ, విశ్వక్ సేన్ పోటీపడబోతున్నారు. ఇప్పటివరకు అంతా ఇంట్రస్టింగ్ గానే ఉంది కానీ.. ఈ రెండు చిత్రాలకు ఇప్పుడు రెండు తలనొప్పులు పుట్టుకొచ్చాయి.

ఒకటి ఏపీలో అర్నాబ్ తుఫాన్, మరొకటి ఏపీలో మున్సిపల్ ఎన్నికలు. ఈ రెండు తలనొప్పులు ఈ సినిమాలపై పడుతున్నాయి. ఈ వీకెండ్ లో ఆదర్శ కుటుంబం, కల్ట్ చిత్రాలకు అటు అర్నాబ్ సైక్లోన్, ఇటు మున్సిపల్ ఎన్నికలు తల నొప్పిగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి ఈ రెండు చిత్రాలు రాంగ్ టైమ్ ని చూజ్ చేసుకున్నాయి. అసలే ఆదర్శ కుటుంబం ఇప్పటికే రెండుమూడుసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్ గా ఈ నెల 30 కి ఫిక్స్ అయ్యి చిన్న సినిమాల పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ఈ చిత్రానికి అర్నాబ్ తుఫాన్, ఎన్నికలు తలనొప్పులుగా మారాయి. 

Aadarsha Kutumbam and Cult to release on Oct 30th