ధర్మన్ కు కళ్ళు చెదిరే ఓటీటీ డీల్

A stunning OTT deal for DharmanA stunning OTT deal for Dharman


జైలర్ చిత్రంతో షర్ట్ నలగకుండా వందల కోట్లుకొల్లగొడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి సరైన సినిమా పడితే బాక్సాఫీసు భీబత్సం ఎలా ఉంటుందో నిరూపితమైంది. జైలర్ 2 లో రజినీకాంత్ చేసింది ఏమి లేదు.. ఐరెన్ డ్రెస్ వేసుకుని అలా నడుచుకుంటూ వందల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు అంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.

జైలర్ 2 తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ తో స్ట్రాంగ్ రికార్డ్ సెట్ చేసిన రజినీకాంత్ తదుపరి మూవీ ధర్మన్. ఈ చిత్రాన్ని అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ స్టార్ క్యాస్ట్ కనిపించబోతుంది. టాలీవుడ్ హీరో రామ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేయబోవడం, రాశి ఖన్నా, శ్రీలీల ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార ఈప్రాజెక్టు లోకి ఎంటర్ అవడంతో ధర్మన్ పై అంచనాలు భారీ లెవల్ కి చేరుకున్నాయి.

అయితే కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కుతున్న ధర్మన్ చిత్రానికి కళ్ళు చెదిరే ఓటీటీ డీల్ సెట్ అయినట్లుగా తెలుస్తుంది. కమల్ హాసన్ ధర్మన్ తో కలిపి మరో రెండు సినిమాలను జియో హాట్ స్టార్ కి విక్రయించారని, అందులో భాగంగా ధర్మన్ డిజిటల్ హక్కులకు ఏకంగా రూ.150 కోట్లు పలికాయని తెలుస్తుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 హిట్ ధర్మన్ డిజిటల్ హక్కులపై ప్రభావం చూపించడమే ఈ రికార్డ్ ఓటీటీ డీల్ కి కారణమంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 

Rajinikanth's Dharman Ott Rights sold for 150 crore