రామాయణ ప్రీమియర్స్ టాక్
Ramayana Premieres Talk
బాలీవుడ్ లో నితీష్ తివారి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన రామాయణ స్పెషల్ ప్రీమియర్స్ తో అప్పుడే వరల్డ్ వైడ్ గా తెగ హడావిడి చేస్తుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణ్ గా తెరకెక్కిన రామాయణ చిత్రానికి సంబందించిన ప్రీమియర్స్ అమెరికాలో పూర్తయ్యాయి.
అమెరికా లాస్ ఏంజిల్స్ లో వేసిన రామాయణ ప్రీమియర్ కి రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి తో సహా రామాయణ టీమ్ హాజరయ్యింది. రామాయణ ని ఇంగ్లీష్ లో వీక్షించిన ప్రేక్షకులు వావ్ విఎఫ్ఎక్స్, గ్రాండియర్ అంటూ రామాయణ పై తమ స్పందనను తెలియజేస్తున్నారు.
రామాయణ లో రావణ్ కేరెక్టర్ లో యశ్ పవర్ ఫుల్ గా అదరగొట్టేసాడు, రాముడిగా రణబీర్, సాయి పల్లవి సీత జంట ఆకట్టుకుంది, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అదిరిపోయాయంటూ రామాయణ ప్రీమియర్ చూసిన వారు రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే నిడివి తగ్గింపు, సెకండ్ పార్ట్ కోసం మొదటి భాగాన్ని ల్యాగ్ చెయ్యడం, గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్స్ రామాయణకు మైనస్ గా మాట్లాడుతున్నారు.
నవంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న రామాయణ చిత్రానికి ఈ ప్రీమియర్స్ టాక్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
















































