ఈ ఏడాది హ్యాట్రిక్ విజయం దక్కేనా?
Will Suriya Keep His Box Office Momentum Strong?
కరోనా తర్వాత సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు 2026 చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ ఏడాది మే లో కరుప్పు చిత్రంతో రూ.200 కోట్ల క్లబ్బులోకి మొదటిసారి ఎంటర్ అయిన సూర్య మూడు నెలలు తిరిగే లోపు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
మూడు నెలల గ్యాప్ లో సూర్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూసారు. కరుప్పు లో వీరభద్రుడిగా మాస్ గా అదరగొట్టిన సూర్య, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో క్లాస్ గా ఇరగదీసాడు. ఈ చిత్రంతో దాదాపుగా రూ.300 కోట్ల క్లబ్బుకి చేరువయ్యారు. తెలుగు, తమిళ్ రెండు లాంగ్వేజెస్ లో ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్స్ చేసాయి.
అదే ఊపులో సూర్య హ్యాట్రిక్ విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సూర్య ఈ ఏడాది మూడో చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. ఈ దివాళి స్పెషల్ గా సూర్య లేటెస్ట్ చిత్రం సీన్ నవంబర్ 6 న విడుదల రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంతో సూర్య హ్యాట్రిక్ విజయం సాధించాలని నమ్మకంగా ఉన్నారు.
మరోపక్క సూర్య ఫ్యాన్స్ కూడా సూర్య ఈ ఏడాది హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. చూద్దాం సూర్య సీన్ ఆయనకు ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో అనేది.!
















































