బిగ్ బాస్ 10: త్రిగుణ్ కి పెరుగుతున్న గ్రాఫ్
Bigg Boss 10: Trigun graph is on the rise
నిన్న మొన్నటివరకు తన మాట తీరుతో అటు హౌస్ మేట్స్ లోను, ఇటు ఆడియన్స్ లోను తన గ్రాఫ్ తగ్గించుకున్న బిగ్ బాస్ సీజన్ 10 సెలెబ్రిటీ కంటెస్టెంట్ త్రిగుణ్ ఇప్పుడు మాట తీరుని మార్చుకుని గ్రాఫ్ పెంచుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన త్రిగుణ్ కి మొదట్లో ఈ సీజన్ కప్ గెలిచే సత్తా ఉంది అనుకున్నారు.
టాస్క్ ల పెరఫార్మెన్స్ లో 100 శాతం సత్తా చూపించే త్రిగుణ్ ఆటలో బెస్ట్ గా ఉన్నప్పటికి.. రోహిత్ విషయంలో అతని తీరు బయట నెగిటివిటీని పెంచింది. అతను ఊసరవెలల్లి, మ్యానిప్యులేటర్ అంటూ సుధీర్ త్రిగుణ్ ని ప్రతిసారి ఎక్స్పోజ్ చెయ్యడం, మరోపక్క రోహిత్ పీఆర్ ముందు త్రిగుణ్ పీఆర్ తేలిపోయింది.
బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే రివ్యూవర్స్ కూడా రోహిత్ కి భజన చెయ్యడం, అతన్నే హైలెట్ చెయ్యడం త్రిగుణ్ కి మైనస్ అయ్యింది. కానీ కొన్నిరోజులుగా రోహిత్ గ్రాఫ్ పడిపోవడం, హోస్ట్ నాగార్జున వీకెండ్ హెచ్చరికలతో త్రిగుణ్ లో మార్పు రావడం అన్ని అతనికి బయట సపోర్ట్ పెరగడానికి కారణమయ్యింది.
ఇక ఓటింగ్ లో ఎప్పుడు టాప్ లో ఉండే రోహిత్ ని అందుకోవడానికి త్రిగుణ్ ఎంతగా ట్రై చేసినా రోహిత్ పీఆర్ ముందు తెలిపోతున్నాడు. కానీ గత వారం రోహిత్ ని క్రాస్ చేసే విధంగా ఓటింగ్ లో త్రిగుణ్ దూసుకుపోయాడు. ఈ వారం గ్రీన్ గోట్ గా నామినేషన్స్ నుంచి తప్పించుకుని ఇమ్యూనిటీ సాధించాడు. బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా త్రిగుణ్ కి ఎలివేషన్ ఇస్తున్నారు.
















































