ప్రదీప్ రంగనాథన్ ప్రొడక్షన్‌లో తరుణ్ భాస్కర్
Tarun Bhaskar is reportedly set to play the lead role in PRS01నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే `PR షో` పేరుతో ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థలో తొలి సినిమాను తెరకెక్కించనున్నట్లు కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించారు. మమితా బైజు నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత అశ్వత్ మారిముత్తు ప్రధాన పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం అశ్వత్ మారిముత్తు ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో టాలెంటెడ్ డైరెక్టర్ .. యాక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో అనమికా మాహి, శివాజీ సోంటినేని, స్వసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే? దీనిని విశాల్ టి.ఆర్, యశ్ వి, నరేన్ సోడా, చణక్కియన్ ఆర్, ధనుష్ కుమార్, ఇలంపరితిలతో కూడిన `ది ఆల్ఫా యూనిట్` అనే ఆరుగురు సభ్యుల బృందం డైరెక్ట్ చేస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ కథ అందించగా.. సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. నటుడిగా మంచి క్రేజ్ ఉన్న ప్రదీప్ తొలిసారిగా నిర్మాతగా మారుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
















































