అక్టోబర్ 30: క్లాస్ vs మాస్
October 30 : Class vs Mass
అక్టోబర్ 30 న బాక్సాఫీసు దగ్గర క్లాస్ vs మాస్ జాతర జరగబోతుంది. క్లాస్ అంటే ఆదర్శ కుటుంబం, మాస్ అంటే కల్ట్ మూవీ లు పోటీపడబోతున్నాయి ఆదర్శ కుటుంబం పలుమార్లు వాయిదా వేసుకుని చివరికి అక్టోబర్ 30 కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది.
ఆదర్శ కుటుంబం చిత్రం పక్కా క్లాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఆ విషయం పోస్టర్ నుంచి వీడియోస్ వరకు స్పష్టంగా అర్ధమైంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ పక్కాగా కనెక్ట్ అవ్వడం గ్యారెంటీ. ఇక విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన కల్ట్ చిత్రం పక్కా మాస్ మెటీరియల్.
ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కంటెంట్ కనిపిస్తుంది. కల్ట్ మూవీ ట్రైలర్, పోస్టర్స్ అన్ని ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పకనే చెబుతున్నాయి. సో అక్టోబర్ 30 న క్లాస్ మూవీ ఆదర్శ కుటుంబం, మాస్ మూవీ కల్ట్ రెండు చిత్రాలు పోటీపడబోతున్నాయన్నమాట.
















































