ప్రభాస్ కి ఛాలెంజింగ్ టైమ్
A challenging time for Prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే కి ఆయన స్నేహితులు, సినీప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ ప్రస్తుతం రెండు క్రేజీ పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. స్పిరిట్, అలాగే ఫౌజీ సినిమాలను పారలల్ గా చేస్తున్నారు. కానీ ఈ రెండు ప్రాజెక్ట్స్ అనుకున్న రిలీజ్ డేట్స్ కి రాలేకపోయాయి.
ఫౌజీ చిత్రం డిసెంబర్ 3 నుంచి పోస్ట్ పోన్ చేసారు కానీ కొత్త విడుదల తేదీ ఇవ్వలేదు, ఈరోజు ప్రభాస్ బర్త్ డే కి ఫౌజీ విడుదల తేదీపై మేకర్స్ స్పష్టత ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరోపక్క మార్చి 5, 2027 నుంచి స్పిరిట్ పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 2027 దివాళికి కొత్త డేట్ లాక్ చేసుకుంది.
ఇక ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ చిత్రాలతో పాటుగా ప్రభాస్ కల్కి 2 సెట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆయన బర్త్ డే స్పెషల్ గా ప్రభాస్ కల్కి 2 సెట్ లోకి వచ్చినట్టుగా కల్కి 2 మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మరి ఇప్పటినుంచి ప్రభాస్ మూడు సినిమాల సెట్స్ లో పని చెయ్యాలి. కల్కి 2, స్పిరిట్, ఫౌజీ మూడు చిత్రాల షూటింగ్స్ ని ఏక కాలంలో ఫినిష్ చెయ్యాలి.
మరి నిజంగా ఇది ప్రభాస్ కి ఛాలెంజింగ్ టైమ్ అనే చెప్పాలి. ప్రభాస్ ఒక్కొక్క సినిమా పూర్తి చేసేస్తే అనుకున్న సమయానికే సినిమాలు బాక్సాఫీసు బరిలోకి వస్తాయి, లేదంటే కొత్త తేదీలు వెతుక్కుంటూ పోతాయి.
















































