ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Shalini's Re-Entry Into Bigg Boss Telugu 10

BB10: షాలిని ఎంట్రీ, రోహిత్ హ్యాపీ, షాకైన హౌస్ మేట్స్

Bigg Boss 10: Shalini's Re-Entry Into Bigg Boss Telugu 10Bigg Boss 10: Shalini's Re-Entry Into Bigg Boss Telugu 10


బిగ్ బాస్ సీజన్ 10 లో సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి రెండు వారాలు సేవ్ అయిన కంటస్టెంట్ షాలిని. ఆమెపై ఆడియన్స్ లో విపరీతమైన నెగిటివిటి ఉంది, అందుకే ఆమెను ఎలిమినేట్ చెయ్యమని ఓట్స్ వేస్తె.. బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను సీక్రెట్ రూమ్ లోకి పంపించడం ఆడియన్స్ కి నచ్చలేదు, మా ఓట్లకు విలువ ఇవ్వరా అంటూ ఫైర్ అయ్యారు.

ఇక సీక్రెట్ రూమ్ లో కూర్చుని హౌస్ లో ఎవరు ఎలా ఉన్నారో చూసిన షాలిని కి రోహిత్ అడుగడుగునా అండగానే ఉన్నాడు. అయితే షాలిని విషయంలో ఎవరి అభిప్రాయమేమిటో ఎవరెలా ఉన్నారో ఆమెకు ఓ ఐడియా వచ్చేసింది. ఇక చూపిస్తా నా ఆట అంటూ రెచ్చిపోతుంది. ఆమెకు సీక్రెట్ రూమ్ సమయం ముగిసి హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చేసారు.

రోహిత్, త్రిగుణ మాట్లాడుకుంటుండగా షాలిని ఎంట్రీ ఇస్తుంది. దానితో రోహిత్ హ్యాపీగా ఆమెను హగ్ చేసుకుని ఎత్తుకుని తిప్పెయ్యగా శివ్ అయితే షాలిని ని చూసి ఓ మై గాడ్ అంటూ షాకయ్యాడు, చాలామంది హౌస్ మేట్స్ లో షాలిని రాక షాకిచ్చింది. అదే రోహిత్ కి చెబుతుంది షాలిని నేను రాగానే అందరూ స్టన్ అయ్యారు అంటూ..

మరి ఎలిమినేట్ అవ్వాల్సిన షాలిని ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది, వచ్చే వారం నామినేషన్స్ లోకి వెళ్లినా మరో వారం ఆమె అదనంగా హౌస్ లో ఉండేందుకు ఛాన్స్ వచ్చినట్టే, అదే బుల్లితెర ఆడియన్స్ కి నచ్చడం లేదు. 

Bigg Boss Telugu 10: Shalini Secret Room to House Re-Entry