టాలీవుడ్ యంగ్ హీరోల ఇంట్రెస్టింగ్ ఫైట్
Vrushakarma vs Cult vs Alias Rukmini
టాలీవుడ్ లో ఒక్కో వారం బాక్సాఫీసు ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాంటి ఫైట్ ఒకటి డిసెంబర్ లో జరగబోతుంది. డిసెంబర్ 3 నుంచి ప్రభాస్ ఫౌజీ తప్పుకోవడంతో ఆ డేట్ పై యంగ్ హీరోలు కన్నేశారు. ఒక్కొక్కరిగా డిసెంబర్ 4 డేట్ ని ఖాయం చేసుకుంటున్నారు. అందులో ముందు నాగచైతన్య-కార్తీక్ దండు వృషకర్మ ఉంది.
ఇప్పటికే నాగచైతన్య-కార్తీక్ దండు వృషకర్మ రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆతర్వాత విశ్వక్ సేన్ కల్ట్ మూవీ ని కూడా డిసెంబర్ 4 నే విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా నితిన్ కూడా అదే డేట్ ని లాక్ చేసి ఇంట్రెస్టింగ్ ఫైట్ కి తెరలేపారు.
నితిన్ హీరోగా నాని నిర్మాతగా తెరకెక్కుతున్న అలియాస్ రుక్మిణి చిత్రాన్ని డిసెంబర్ 4 రిలీజ్ అంటూ రీసెంట్ గానే నిర్మాతలు ప్రకటించడంతో డిసెంబర్ 4 న బాక్సాఫీసు ఫైట్ యువ హీరోల నడుమ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఆ తేదికి ఇంకెంతమంది హీరోలు వస్తారో జస్ట్ వెయిట్ అండ్ సి.
















































